![]() |
![]() |

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -146 లో.....ప్రేమ ధీరజ్ స్టోర్ రూమ్ కి వెళ్తారు. రూమ్ నీట్ గా సర్దుతారు. ఒకవైపు వర్క్ చేస్తునే టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేసుకుంటారు ప్రేమ కింద పడిపోతుంటే ధీరజ్ పట్టుకుంటాడు. ఒకరినొకరు ప్రేమ గా చూసుకుంటారు. ఆ తర్వాత ధీరజ్ కి కాఫీ తీసుకొని వస్తుంది ప్రేమ. ఇద్దరు ఒకరివంక ఒకరు చూస్తూ ప్రేమగా చూసుకుంటారు.
మరొకవైపు భాగ్యం దేవుడికి మొక్కుకుంటుంది. ఎందుకు ఇలా దేవుడిని భయపెడుతున్నావని భాగ్యంతో తన భర్త అంటాడు. మన శ్రీవల్లికి ఎంత మంచి సంబంధం దొరికింది ఎట్టకేలకు వాళ్ళ ఇంటికి పంపించామని భాగ్యం అంటుంది. ఒకసారి ఫోన్ తీసుకొని రా శ్రీవల్లికి ఫోన్ చెయ్యాలి అంటుంది. భాగ్యంకి తన భర్త ఫోన్ తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడే శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. నువ్వు రాత్రి చెప్పినట్టు చేసాను.. వాళ్ళ శోభనం ఆపేసానని శ్రీవల్లి చెప్తుంటే నర్మద వస్తుంది కానీ తన మాటలు వినదు. నర్మద రాగానే శ్రీవల్లి మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది. బయటకు వచ్చి మాట్లాడుతుంటే నర్మద వస్తుంది ఏంటి అక్క అలా టెన్షన్ పడుతున్నావని నర్మద అడుగుతుంది. మా అమ్మతో మాట్లాడుతున్నాను.. రోజు మా అమ్మ మాట్లాడుతుంది.. అయ్యో నీకు ఇలా అమ్మతో మాట్లాడే అదృష్టం లేదు కదా అని నర్మద బాధపడేలా శ్రీవల్లి మాట్లాడుతుంది. ఆ తర్వాత రామరాజుకి భాగ్యం ఫోన్ చేసి పదహారు రోజుల పండుగకి అందరు రండి అని చెప్తుంది.
నాకు వీలు అవ్వదు వాళ్ళు వస్తారని రామరాజు చెప్తాడు. వల్లి మీ వాళ్ళతో మాట్లాడమని వేదవతి అనగానే.. నాకూ అమ్మనాన్నలాగా మీరు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలనిపించడం లేదని అనగానే నర్మద షాక్ అవుతుంది. నాకు ఆఫీస్ ఉంది నేను రానని నర్మద ఆఫీస్ కి వెళ్తుంది. తరువాయి భాగంలో ప్రేమ రెడీ అవుతూ నర్మదని పిలుస్తుంది కానీ ధీరజ్ వచ్చి ఏంటని అడుగుతాడు నా జాకెట్ హుక్ పెట్టాలని అనగానే ధీరజ్ పెడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |